- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాస్టాగ్ అమలు గడువును పొడిగించే ప్రసక్తే లేదు : నితిన్ గడ్కరీ
దిశ, వెబ్‌డెస్క్: ఫాస్టాగ్ అమలు గడువును మరింత పొడిగించే అవకాశం లేదని, వాహన యజమానులు వెంటనే ఈ-పేమెంట్ సదుపాయాన్ని వినియోగించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం స్పష్టం చేశారు. టోల్ ప్లాజాలలో ఎలక్ట్రానిక్ చెల్లింపులను సులభతరం చేసే ఫాస్టాగ్ 2016లో ప్రవేశపెట్టారు. ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేయడం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా వెళ్లేందుకు సాహయపడుతుందని ప్రభుత్వం భావితోంది. సోమవారంతో ఫాస్టాగ్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో, దీనిపై మాట్లాడిన నితిన్ గడ్కరీ..’ ప్రభుత్వ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ తేదీని ఇప్పటికే రెండు, మూడుసార్లు పొడిగించిందని, ఇప్పుడు దీన్ని మరింత కాలం పొడిగించే వీలు లేదని, అందరూ వెంటనే ఫాస్టాగ్‌ను కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్లు కొన్ని చోట్ల 90 శాతానికి పెరిగింది. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు దీన్ని వినియోగించి, ట్రాఫిక్ లేని సౌకర్యవంతమైన ప్రయాణ చేయాలని గడ్కరీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.