షాక్‌లో టాలీవుడ్: వేదం నాగయ్య మృతి

by Shyam |
Vedam Nagaiah
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది. అనేక తెలుగు సినిమాల్లో తన సహజ నటనతో మెప్పించిన వేదం నాగయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తు్న్నారు. ‘వేదం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నాగయ్య.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. వేదం నాగయ్యగా ఆదరించబడ్డారు. దాదాపు 30 సినిమాల్లో తన నటనతో ఆకట్టున్న ఆయన.. లాక్‌ డౌన్ తర్వాత సినిమా చాన్స్‌లు లేక ఆర్థికంగా చతికిలబడ్డారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్, మా అసోసియేషన్ తనకు అండగా నిలిచింది. అయితే కొద్ది రోజుల క్రితం భార్య మరణించడంతో అప్పటి నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వేదం నాగయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు.

గుంటూరు జిల్లా, నరసరావుపేట సమీపంలోని దేసవరం పేటకు చెందిన రైతు నాగయ్యకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. కానీ కాలం కలిసిరాకపోవడం, కనీసం కూలి పనులు కూడా లేకపోవడంతో కొడుకు, భార్యతో కలిసి పనికోసం హైదరాబాద్‌కు వలసొచ్చాడు. ఈ క్రమంలో నాగయ్య ప్రతిభను గుర్తించిన దర్శకులు క్రిష్ .. ‘వేదం’ సినిమాలో అవకాశం ఇచ్చారు.



Next Story