- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్: సౌదీలో వ్యాట్ భారీగా పెంపు
కరోనా రక్కసి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను మూడింతలు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు చెల్లించే జీవన భృతిని కూడా నిలిపివేస్తున్నట్లు సౌదీ ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్- జాదాన్ మీడియాకు వెల్లడించారు.
‘‘వ్యాట్ 5 నుంచి 15 శాతానికి పెంచబోతున్నాం. ఇది జూలై నుంచి అమల్లోకి రానుంది. ఇక ప్రజలకు ఇచ్చే జీవన భృతిని జూన్ నుంచి నిలిపివేయనున్నాం.’’ అని ఆర్థిక మంత్రి జాదాన్ అక్కడి అధికారిక మీడియా సౌదీ ప్రెస్ ఏజెన్సీకి తెలిపారు. ఒకవైపు కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు చమురు ధరల పతనంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. దీంతో ఆర్థిక రంగాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని జాదాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే చమురు ధరలు మూడింట రెండు వంతుల తగ్గినందునా, చమురు ఉత్పత్తుల అమ్మకం ద్వారా దేశానికి వచ్చే ఆదాయంలో సగం కోల్పోయామని మంత్రి తెలిపారు. ఇప్పటికే సౌదీ అరేబియా అదనపు ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా 2018లో వస్తుసేవలపై 5 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.