- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్యలు తీసుకుంటాం.. మంత్రి, ఎమ్మెల్యేల ఆడియో టేప్‌లపై స్పందించిన వాసిరెడ్డి పద్మ
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఫోన్‌లో మహిళలతో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రతిపక్ష, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆడియో టేపుల లీకేజీ ఘటనలపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు.
ఆడియో టేపుల అంశంపై విచారణ అవసరమని, ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారని, ఆడియో టేపుల ఘటనలపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మహిళా కమిషన్ తరపున సమాచారం తెప్పించుకుంటామని, అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు. మహిళలను ఇబ్బంది పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వ్యాఖ్యానించారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించాలని, అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.