శ్రీకాంత్ అడ్డాలకు కృతజ్ఞతతో వరుణ్

by Jakkula Samataha |
శ్రీకాంత్ అడ్డాలకు కృతజ్ఞతతో వరుణ్
X

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్…. ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఒక్కో సినిమాకు భారీ వేరియేషన్ చూపిస్తున్న వరుణ్ తరువాతి చిత్రంలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ముంబైలో ట్రేనింగ్ కూడా తీసుకుంటున్నాడు. కిరణ్ కొణిజేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం భారీగా వర్కౌట్ కూడా చేస్తున్నాడట.

అయితే, కెరియర్ సక్సెస్‌‌ఫుల్‌గా సాగుతున్నప్పుడు డైరెక్టర్లు తమ సినిమా చేయాలని స్టోరీలతో హీరోల దగ్గరకు వెళ్లడం కామన్. అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డిలతోపాటు పలువురు డైరెక్టర్లు వరుణ్‌తో మూవీ చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ స్క్రిప్ట్‌కు వరుణ్ అయితేనే సెట్ అవుతాడంటూ వెయిట్ చేస్తున్నారు. కానీ, వరుణ్ మాత్రం తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌ శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్‌తో ఏ హీరో కూడా శ్రీకాంత్ అడ్డాలతో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో వరుణ్ ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి తనను ఇంట్రడ్యూజ్ చేసినందుకు ఆవిధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనుకుంటున్నాడట.

Advertisement

Next Story