- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెల్లి, బావతో వరుణ్ దీవాళీ సెలబ్రేషన్స్
దిశ, వెబ్‌డెస్క్ : మిస్ నిహారిక డిసెంబర్‌లో మిసెస్‌గా మారనున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంలో పెళ్లి హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే నిహారక గోవాలో ఇటీవలే బ్యాచిలర్ పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీకి చైతన్య కూడా హాజరు కాగా, మరోసారి వీరిద్దరూ దీపావళి పండుగను మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. నాగబాబు ఇంట్లో ఈ దీపావళి స్పెషల్ గా మారింది. వరుణ్ తేజ్ తన బావ, చెల్లితో కలిసి సరదాగా పండుగ జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
చెల్లి, బావలతో ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్’ అంటూ వరుణ్ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నిహారిక చైలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో వీరి వివాహం జరగనుంది.