సీఎం గారూ.. తొందరపాటు నిర్ణయాలు తగవు: వర్ల

by srinivas |
సీఎం గారూ.. తొందరపాటు నిర్ణయాలు తగవు: వర్ల
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల బిల్లుపై పట్టుదలకు పోకుండా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య సూచనలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా.. ‘ముఖ్యమంత్రి గారూ.. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు. అవునా?’ అని సూచించారు.

Advertisement

Next Story