- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండున్నరేళ్ల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వరవరరావు..
దిశ, తెలంగాణ బ్యూరో : విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ముంబయిలోని నానావతి ఆసుపత్రి నుంచి శనివారం రాత్రి 11.45 గంటలకు డిశ్చార్జి అయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఆయన బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆసుపత్రి ఆవరణ నుంచి బయటకు రాగానే పిడికిలి బిగించిన చేతితో మీడియాకు అభివాదం చేశారు. వరవరరావు బయటకు వచ్చారని ఆయన తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్వీట్ ద్వారా ధ్రువీకరించారు.
గత నెల 22న ముంబై హైకోర్టు ఆయనకు ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చికిత్స నిమిత్తం నానావతి ఆసుపత్రిలోనే ఉండిపోయారు. శనివారం రాత్రి ఆయన సంతోషంతో డిశ్చార్జి అయ్యారు. భీమా కోరేగావ్ కేసులో ‘ఉపా’ చట్టం కింద 2018 ఆగస్టు 28న అరెస్టయ్యి మహారాష్ట్రలోని తలోజా జైలులో రెండున్నరేళ్ళ పాటు ఉన్న వరవరరావు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు పలు ఆంక్షలతో ఆరు నెలల పాటు ఇంట్లో ఉండేలా అవకాశం కల్పించింది.