ఆ హీరోయిన్స్ సపోర్ట్‌పై వరు థాంక్స్ నోట్..

by Shyam |
ఆ హీరోయిన్స్ సపోర్ట్‌పై వరు థాంక్స్ నోట్..
X

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే స్టిక్ అయిపోయి గ్లామరస్ టచ్ ఇవ్వకుండా.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి శభాష్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్‌గా మరో స్టెప్ తీసుకుంది వరు. ‘కన్నమూచి’ చిత్రం ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభ కనబరచబోతుంది. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి మార్కులు పడగా.. లీడ్ రోల్ తనే చేస్తుండటం విశేషం.

కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ 50 మంది సీనియర్ అండ్ ప్రజెంట్ హీరోయిన్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయించింది వరు. ఇందుకు థాంక్స్ చెప్తూ పోస్ట్ కూడా పెట్టింది. తను అడిగిన వెంటనే కను రెప్ప వేసే టైమ్ కూడా తీసుకోకుండా ఇందుకు ఓకే చెప్పారని ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయం తనను మాత్రమే కాదు, సమాజంలోని ప్రతీ ఒక్క మహిళను మీరు గౌరవిస్తారన్న విషయాన్ని చూపిస్తుందని చెప్పింది. ‘స్త్రీలు ఒకరినొకరు ఎలా పవర్‌ఫుల్‌గా మలుచుకోగలరో చూపేందుకు ఇది ఒక ఉదాహరణ అని.. ఇది మహిళలందరికీ స్ఫూర్తిని పంచే ఒక అడుగు’ అని అభిప్రాయపడింది. స్త్రీకి స్త్రీనే శత్రువన్న నానుడికి గుడ్ బై చెప్తూ.. బలమైన మహిళలుగా మారుతూ సపోర్ట్ చేసుకుందామని పిలుపునిచ్చింది.

https://www.instagram.com/p/CGoy7puAvNM/?igshid=2bqeduzosjv2

కాగా ఈ 50 మంది మహిళల్లో రాధిక శరత్ కుమార్, రేవతి, జ్యోతిక, అదితి రావు హైదరి, ఐశ్వర్య రాజేష్, అక్షర హాసన్, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, మంచు లక్ష్మీ ప్రసన్న, మంజిమా మోహన్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story