- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ స్పెషల్.. సర్వపిండి ఎలా తయారు చేయాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ స్పెషల్ వంటకాల్లో సర్వపిండి ఒకటి. చాలా మంది దీన్ని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. అయితే ఈ సర్వపిండిని ఎలా తయారు చేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సర్వపిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – రెండు కప్పులు
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – 6 లేదా 8
జీలకర్ర – 2 టీ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
వేయించి పొట్టు తీసిన పల్లీలు – 2
టేబుల్ స్పూన్స్, నానబెట్టిన పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్,
నువ్వులు – ఒక టేబుల్ స్పూన్
తరిగిన కరివేపాకు – 2 రెబ్బలు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం : సర్వపిండిన తయారు చేయడానికి ముందుగా పచ్చిమిర్చి, జిలకర్ర, ఉల్లిపాయ ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకని అందులో బియ్యం పిండిని వేసి, పచ్చిమిర్చి పేస్టుతో పాటు, మిగిలిన అన్ని పదార్థాలను వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. తర్వాత సర్వపిండి గిన్నెలు లేదా, గుండ్రటి బౌల్స్ తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ముందుగా కలిపి పెట్టుకున్న సర్వపిండిని తీసుకొని బౌల్‌లో చేత్తో సర్వపిండిలా వత్తుకోవాలి. తర్వాత సర్వపిడి బౌల్‌ను స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. అంతే సర్వపిండి రెడీ. ఇక ఇది తినడానికి చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: ఈవినింగ్ సరదాగా స్నాక్స్ తినాలని ఉందా.. ఇది ట్రై చేయండి