చికెన్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం !

by Prasanna |
చికెన్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం !
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది చికెన్ ఇష్టంగా తింటారు. ఆదివారం వస్తే చాలు చికెన్ తెచ్చుకొని తినేస్తుంటారు. అలాగే కొంత మంది దీనితో రక రకాల రెసిపీస్ కూడా తయారు చేస్తుంటారు. వాటిలో చికెన్ టిక్కా ఒకటి. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ ఇది ఎలా చేస్తారో కొంత మందికి తెలీదు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కావాలిసిన పదార్ధాలు :

బోన్ లెస్ చికెన్ - 200 గ్రాములు

క్యాప్సికం - 1

ఉల్లిపాయలు - 1

టొమాటో - 1

1 టేబుల్ స్పూన్ - ధనియాల పొడి

1/2 టేబుల్ స్పూన్ - అల్లం వెల్లుల్లి పేస్టు

1 టేబుల్ స్పూన్ - కారం

1 టేబుల్ స్పూన్ - పసుపు

1 టేబుల్ స్పూన్ - జీలకర్ర పొడి

1 టేబుల్ స్పూన్ - గరం మసాలా

1/2 టేబుల్ స్పూన్ - ఒక కప్పు పెరుగు

నిమ్మసరం - 1 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - 1 కట్ట

ఉప్పు - సరిపడినంత తీసుకోవాలి.

తయారీ విధానం :

ముందు బోన్ లెస్ చికెన్‌ను తీసుకోని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నె తీసుకొని దానిలో గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వెల్లుల్లి పేస్టు, పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, వేసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోలు ముక్కలు..కట్ చేసిన ఉల్లిపాయలను వేసి అవి ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలి. వెదురు కర్రలను తీసుకొని 20 నిముషాలు నానాబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని వెదురు కర్రల్లో వేసుకొని వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేసుకోవాలి. ఈ వెదురు కర్రలను పొయ్యి పై ఉంచాలి. మధ్యలో ఒకసారి చికెన్ ఉడికిందా లేదనేది చూసుకోవాలి. చికెన్ ఉడికిన తరవాత దాన్ని ఒక ప్లేటులోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ టిక్కా రెడి.

Advertisement

Next Story