- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళి స్పెషల్.. ఈ స్వీట్ తింటే ఆ రుచే వేరు
దిశ, వెబ్ డెస్క్: దీపావళి రోజు కచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే. అలాగే ఇంటికొచ్చే అతిధులకు స్వీట్లు పంచాల్సిందే. అందుకే ఇంట్లోనే టేస్టీగా ఉండే స్వీట్ చేసుకోవడం ఎలానో చుద్దాం.
కావాల్సిన పదార్థాలు..
క్రీమ్ మిల్క్ -ఒక లీటరు
పంచదార - వంద గ్రాములు
యాలకుల పొడి - అరస్పూను
నెయ్యి - ఒక టీస్పూను
నిమ్మరసం - రెండు టీస్పూన్లు
తయారి విధానం
1. ఒక కళాయిలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్‌ను చిన్న మంట మీదే ఉంచాలి.
2. పాలును అలా చిన్న మంట మీదే మగ్గిస్తూ ఉంటే సగానికి పైగా ఆవిరై అరలీటరు చిక్కని పాలగా మారుతాయి.
3. ఇప్పుడు నిమ్మరసాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి.
4. ఆ పాలలో పంచదారను కూడా వేసి అలా ఉడికించాలి.
5. ఆ మిశ్రమం అంతా చిక్కగా మారేవరకు అలా మగ్గించాలి.
6. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
7. కలాకండ్‌లా చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి.
8. ప్లేటుకు నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
9. కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కోసుకోవాలి.
10. అంతే అదిరిపోయే టేస్ట్‌తో కలాకండ్ తయారైపోయినట్లే!