నా కొడుకుని చంపినోళ్లను ఉరితీయాలి : వామన్ రావు తల్లి

by Sridhar Babu |   ( Updated:2021-02-18 06:33:06.0  )
Vaman Rao parents
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. హైకోర్టు సైతం ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటుగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీనిపై వామనరావు తల్లీదండ్రులు స్పందించారు. ఈ సందర్భంగా తండ్రి కిషన్ రావు మా మీడియాతో మాట్లాడుతూ… ‘‘నా కుమారున్ని చంపిన వారిని చట్టపరంగా శిక్షించాలి. ఈ హత్యకు ప్రతీకారంగా వారిని కూడా హత్య చేయాలి. ఈ హత్య చేసింది కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్‌లు. వీరి వెనుక చాలా మంది పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారు. హత్య చేసిన ఇద్దరినీ సరైన విధంగా విచారిస్తే చాలా మంది బయటపడతారు’’ అని అన్నారు. అనంతరం వామన్ రావు తల్లి మాట్లాడుతూ… ‘‘నా కొడుకుని పుట్ట మధు చంపించాడు. పుట్ట మధు, డి.వసంతరావులు నా కుమారుని హత్యకు కారణం. నా కొడుకుని చంపిన శ్రీనివాస్, కుమార్‌లను సరైన విధంగా విచారించి,ఆ ఇద్దిరినీ కూడా ఉరి తీయాలి. అప్పుడే దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయటపడుతుంది.’’ అని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed