- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అడ్వకేట్స్ మర్డర్… పోలీసులపై రహస్య విచారణ?
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు అడ్వకేట్స్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోంది. వామన్ రావు హత్య తరువాత స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రామగుండం పోలీసులతో పాటు హైదరాబాద్ కు చెందిన ఉన్నతాధికారులు ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నారు.
నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ప్రత్యక్ష్యంగా ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కేసు ఇన్వెస్టిగేషన్ కూడా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే నడుస్తోందని తెలుస్తోంది. కేసులో ఎలా ముందుకు సాగాలో కూడా హైదరాబాద్ అధికారుల నుంచే సూచనలు వస్తుండటంతో వాటినే అమలు చేయాల్సిన పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ ఘటన విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు పోలీసు అధికారులు. కేసును సీబీఐకి అప్పగించాలని హై కోర్టులో వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తే కేసు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగి వెలుగులోకి రాని వాస్తవాలను బయటకు తీస్తే రాష్ట్ర ప్రభుత్వం అబాసుపాలవతుందని గమనించిన ఉన్నతాధికారులు సీరియస్‌గా మానిటరింగ్ చేస్తున్నారు.
పోలీసులపై సీక్రెట్ విచారణ..
వామన్ రావు దంపతుల హత్య విషయంలో స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసు అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో రహస్య విచారణ సాగుతున్నట్టు సమాచారం. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్న్టట్టు సమాచారం. రామగిరి ఎస్సై తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన ఇన్ వాల్వ్ మెంట్ గురించి కూడా వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది.