టైమ్ వేస్ట్ అవుతోంది.. టెస్టింగ్ సెంటర్ పెట్టండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్

by Shyam |
KTR twitter
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే హైద‌రాబాద్‌లో టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కేంద్రానికి విన్నవించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌కు క్యాపిటల్‌గా మారిన హైదరాబాద్‌లో ఈ టెస్టింగ్ సెంటర్ కచ్చితంగా అవసరమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఆరు నెలల్లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయవచ్చునని తెలిపారు. టెస్టింగ్ సెంటర్‌కు అవసరమైన భూమిని జీనోమ్ వ్యాలీలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి జాతీయ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని సంస్థలు వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం అక్కడికి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రక్రియతో 45 రోజుల సమయం వృథా అవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story