- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెటర్లకు వ్యాక్సిన్.. నో
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద క్రికెట్ పండుగకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్, రిచ్ టోర్నీగా పేరు పొందిన ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోని టాప్ క్రికెటర్లందరూ ఆడే ఐపీఎల్ కోసం అభిమానులు వేచి చూస్తూ ఉంటారు. కరోనా ప్రభావం క్రమంలో గత నవంబర్‌లో జరిగిన ఐపీఎల్-13 క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించింది. కరోనా వల్ల గత ఐపీఎల్ విదేశంలో, అభిమానులు లేకుండా జరిగినా క్రికెట్ అభిమానులకు థ్రిల్‌ను కలిగించింది.
ఇప్పుడు ఐపీఎల్ 14కు ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెల 9 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సారి స్వదేశంలోనే టోర్నీ జరుగుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం క్రమంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. దీంతో మళ్లీ టీవీల్లోనే మ్యాచ్‌లు చూసి ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి.
అయితే ఐపీఎల్‌లో పాల్గొనే భారతీయ క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే డిమాండ్ ప్రాంచైజీల నుంచి వస్తోంది. ఈ మేరకు తమ టీమ్‌లోని భారతీయ క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని బీసీసీఐకి ఢిల్లీ క్యాపిటల్స్ లేఖ రాసింది. దీంతో మిగతా ప్రాంచైజీలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో దీనిపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది. ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.