- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టీకా ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌పై కొంతమేర అపోహాలు ఉండడంతో చాలా వరకు జనాలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకునేముందు ఏం చేయాలి.. తీసుకున్న తర్వాత ఏం చేయాలి అన్న విషయంపై అవగాహనా రాహిత్యమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.
వ్యాక్సిన్ తీసుకునేముందు-తీసుకున్న తర్వాత..
వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగానే ప్రిపేర్ కావడం మేలైన మార్గం. ముఖ్యంగా ఆల్కహాల్ తాగుతున్న వారు అయితే కొద్ది రోజుల ముందుగానే డ్రింక్ బంద్ చేయాలి. ఎందుకంటే మద్యం సేవించే వారు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే.. వ్యాక్సిన్‌కి ముందు వారం రోజుల పాటు మద్యానికి దూరం ఉండటం మంచింది. అంతేకాదు.. మొదటి డోసు వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా 2, 3 వారాల పాటు మద్యం సేవించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఫుడ్ మెనూ తప్పనిసరి..
మొదటి డోస్ తీసుకునే ముందు నుంచే ఫుడ్‌పై కాస్త శ్రద్ధ పెట్టాలి. వాటర్, వాటర్ పర్సంటేజ్ ఫ్రూట్స్, ఫైబర్ ఫుడ్(ఉదా: గోదుమలు)ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం తగ్గుతుంది. బాడీలో ఎనర్జీ లెవల్స్ పెరిగే ఫుడ్‌ను మెయింటేన్ చేయడం వల్ల.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెద్దగా ప్రభావం కనిపించదు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. మొదటి డోస్ నుంచి రెండో డోసు వ్యవథి కాలంలో న్యాచురల్ ఫుడ్ మెనూ మెయింటేన్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు.
- Tags
- COVID-19