ఢిల్లీలో వారికి వ్యాక్సినేషన్ వాయిదా

by Shamantha N |
Vaccination
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మే 1 నుంచి మూడో దశ టీకా పంపిణీ మొదలయ్యేలా లేదు. టీకా కొరత కారణంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ‘ప్రస్తుతం మా దగ్గర టీకాలు లేవు. డోసులను పంపించాల్సిందిగా కంపెనీలను కోరాం. అవి రాగానే ప్రజలకు తెలియజేస్తాం’ అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. టీకా ఉత్పత్తిదారులూ ఎప్పుడు వ్యాక్సిన్‌లను పంపిస్తారో ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదని వివరించారు. టీకా ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి 1.34 కోట్ల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసుకునే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందని సోమవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితులపై ఆయన అధికారులతో సమావేశం కానున్నారు.

Advertisement

Next Story