- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు వ్యాక్సిన్
దిశ, తెలంగాణ బ్యూరో : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుకానున్నది. ఇందుకోసం శుక్రవారం నుంచి తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డిపార్టుమెంటు వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ అవకాశం అందుబాటులోకి రానున్నది. విదేశాలకు విద్యా అవసరాల కోసం వెళ్ళే విద్యార్థులకు టీకాలు లేని కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖ భావించింది.
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వీరికి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యతలు తీసుకున్నది. ఎన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఉంటుంది, వారి కోసం ఏ సమయాన్ని కేటాయించాలి, మొత్తం ఎంత మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నది. ఒక రోజు ముందుగానే సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపిక చేసుకునేలా వెబ్‌సైట్‌లో ఆప్షన్లను పెట్టనున్నది.