నేటి నుంచి ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

by Shyam |
tsnpdcl vaccination
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) ఉద్యోగులకు సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంస్థ పరిధిలోని 16 సర్కిళ్లలోని విద్యుత్ ఉద్యోగులు, ఆపరేషన్స్ అండ్ మెయింటనన్స్ సిబ్బంది, ఆర్టీజన్లు, అన్ మ్యాన్డ్ వర్కర్స్, స్పాట్ బిల్లర్లు, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్లు, స్టోర్ లేబర్లందరికీ టీకా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యుత్ ఉద్యోగి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని సీఎండీ ఆదేశించారు. స్వీయ నియంత్రణవల్లే కరోనా బారినుంచి రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగులకు టీకా ఇచ్చేలా ఆదేశాలు జారీచేసిన సీఎం కేసీఆర్ కు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్పీడీసీఎల్ సంస్థలోనూ..

ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటనన్స్ సిబ్బంది, ఆర్టీజన్లు, స్వీపర్లు, ఇతర సిబ్బందికి సోమవారం నుంచి వ్యాక్సిన్ వేస్తున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు, ఎర్రగడ్డ సీపీటీఐ వద్ద వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి టీకా వేస్తామని అధికారులు వెల్లడించారు. తప్పనిసరిగా సంస్థ ఐడీ కార్డుతో పాటు అధార్ కార్డును తీసుకురావాలని వారు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed