- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లలో టీకా ఏర్పాట్లు: తలసాని
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్‌కు ఒకటి చొప్పున మొత్తం 30 టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, బన్సీలాల్ పేట లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రె డర్స్ కు చేపట్టిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వెయ్యి మంది చొప్పున 30మందికి వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్నామని వివరించారు. 10 రోజుల్లో 3లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చూసేందుకు తగిన ఏర్పాట్లను చేపట్టామని చెప్పారు. కూరగాయల విక్రయదారులు, చిన్న వ్యాపారులు, అటో డ్రైవర్లు, పుట్ పాత్ వ్యాపారులు తదితరులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు టోకెన్ లను అందజేస్తారని, అందులో తెలిపిన సమయానికి కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
జర్నలిస్టులకు కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని తెలియజేశారు. కరోనా సమయంలో డాక్టర్లు, నర్స్‌లు, ఆశా వర్కర్లు, పోలీసులు, జీహెచ్ఎంసీ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. లాక్‌డౌన్‌లో ఆకలితో ఎవరు అలమటించ వద్దనే ఉద్దేశంతో ప్రతిరోజూ 60 వేల మందికి అన్నపూర్ణ బోజన కేంద్రాల ద్వారా ఉచితంగా బోజన సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ శానిటైజేషన్, పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది ఇలాంటి సమయంలో రాజకీయ లబ్దిపొందే ప్రయత్నం చేయడం శోచనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, స్థానిక కార్పొరేటర్ లు కోలన్ లక్ష్మి, కుర్మా హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,డీఎంసీ లు వంశీ, ముకుంద రెడ్డి, ఏఎంహెచ్ఓ లు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.