తెలంగాణలో 1,45,972 మందికి వ్యాక్సిన్

by Shyam |
తెలంగాణలో 1,45,972 మందికి వ్యాక్సిన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా మరో 1,45,972 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 1,09,327 మంది ఫస్ట్, 36,645 మంది సెకండ్ డోస్ వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,05,472 మంది హెల్త్ కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 2,28,365 మంది రెండో డోసును తీసుకున్నారు. అదే విధంగా 3,17,876 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి, 2,08,790 మంది రెండో టీకాను పొందారు.

18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 59,31,144 మంది తొలి 8,44,875 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్ల పై బడిన వారిలో 56,26,770 మంది ఫస్ట్, 29,06,392 మంది రెండో డోసును తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులెటెన్ లో స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు 1,33,28,603 మంది ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోగా, 30,41,081 మంది ప్రైవేట్ సెంటర్లలో టీకా వేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story