- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివాళికి కూడా టైట్ షెడ్యూల్ : వాణి
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ గత రెండు నెలలుగా ఫుల్ బిజీ అయిపోయింది. కనీసం తల్లిదండ్రులు, సోదరిని కలుసుకోలేనందుకు కూడా టైమ్ దొరకడం లేదని చెప్తోంది. రణ్‌బీర్ కపూర్‌తో ‘షంషెరా’ మూవీ షూటింగ్ పూర్తి చేసిన భామ.. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ షూటింగ్ కోసం స్కాట్లాండ్ వెళ్లింది. అక్కడి నుంచి ఆయుష్మాన్ ఖురానాతో చేస్తున్న ‘చంఢీగర్ కరె ఆషికి’ సినిమా కోసం చంఢీగర్ పయనమైంది. దివాళికి కూడా ఇంటికి వెళ్లే వీలు లేకుండా టైట్ షెడ్యూల్‌లో ఉన్న వాణి.. పాండమిక్ సిట్యువేషన్‌లో కూడా ఇంత బిజీ షెడ్యూల్‌తో గడపడం ఒక నటిగా గర్వంగా ఉందని తెలిపింది. నెలల తరబడి హోటల్ గదిలోనే ఉంటున్నానని, ప్రజెంట్ యాక్టర్స్‌కు ఇది సర్వసాధారణం అయిపోయిందని అంటోంది. నటులు తమ చుట్టూ బయో బబుల్ నిర్మించుకుని, పని కొనసాగించాలని.. తద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని కోరింది.
థియేటర్స్‌లో రిలీజ్ కాబోయే బిగ్ ప్రాజెక్ట్స్‌లో భాగస్వామ్యం కావడం థ్రిల్లింగ్‌గా ఉందన్న వాణి కపూర్.. సినిమాలు ఆడియన్స్ ప్రతీరోజు ఎదుర్కొనే కష్టాలు మరిచిపోయేలా ఒక ట్రాన్స్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాయని.. వారికి సంతోషాన్ని పంచుతాయని అంది. తను కూడా అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, ఆడియన్స్ ఫేస్‌లో స్మైల్ తీసుకురావడంలో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పింది.