తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది : వీహెచ్

by Shyam |
v hanumantarao news
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒక బీసీ సర్పంచ్‌ను పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సస్పెండ్ చేయించారని, తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల పక్షాన ఉండే ఒక సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం, ఒక దగ్గర నామినేషన్లు వేస్తే పత్రాలు చింపడం అనేది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యం కొనసాగడానికి నిదర్శనం అని మండిపడ్డారు. అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు కావడం లేదని, సర్పంచ్‌కు న్యాయం జరిగేదాక పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణలో ఎస్సీ, బీసీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, తిరగబడే రోజు వస్తుందని తెలిపారు. కేసీఆర్‌కు 2023 లో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed