కపుల్ చాలెంజ్..యూపీ కుర్రాడితో హాలీవుడ్ నటి

by Sujitha Rachapalli |
కపుల్ చాలెంజ్..యూపీ కుర్రాడితో హాలీవుడ్ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్‌లో ఏదో ట్రెండ్ లేదా చాలెంజ్ బజ్ అవుతూనే ఉంటుంది. లాక్‌డౌన్ టైమ్‌లో బోలెడు చాలెంజ్‌లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నెట్టింట్లో ‘కపుల్ చాలెంజ్’ చక్కర్లు కొడుతోంది. ఎంతోమంది బ్యూటిఫుల్ కపుల్స్,సెలెబ్రిటీలు తమ జంట ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. తమ అన్యోన్యమైన ప్రేమకు నిదర్శనంగా ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే, యూపీకి చెందిన ఓ కుర్రాడు ఏకంగా హాలీవుడ్ నటి ఫొటో పెట్టి ‘కపుల్ చాలెంజ్’అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ఆ హాలీవుడ్ నటి కూడా ఫన్నీ సమాధానంతో యూపీ కుర్రాడికి బదులిచ్చింది.
అదేంటి ఇక్కడ తెలుసుకోండి..లెట్స్ గో..

కపుల్ చాలెంజ్ వైరల్ కావడంతో మీమ్స్ క్రియేటర్స్ సింగిల్స్‌పై బోలెడన్నీ మీమ్స్ చేస్తున్నారు. కపుల్ ఫొటోలు చూసి బోరున ఏడుస్తున్నట్లు మీమ్స్ చేస్తున్నారు. బ్యాచిలర్స్ కూడా సింగిల్ చాలెంజ్ అంటూ.. కపుల్ చాలెంజ్‌కు ధీటుగా స్పందిస్తున్నారు. వీళ్లందరికీ భిన్నంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాశ్ ఫొటోషాప్ ఎడిటింగ్ స్కిల్స్‌తో హాలీవుడ్ నటి అలెగ్జాండ్రా దద్దారియో ఫొటోను మిక్స్ చేసి హ్యాష్‌ట్యాగ్ కపుల్ చాలెంజ్‌తో షేర్ చేశాడు. అది క్లియర్‌గా ఫొటోషాప్ వర్క్ అని ఈజీగా తెలుస్తోంది. అందుకే ఆకాశ్ ఆ ఫొటోకు కాస్త ఫన్ కూడా యాడ్ చేస్తూ.. ‘శత్రువులు..ఈ ఫొటోను చూసి.. ఫొటో షాప్ ఎడిటింగ్’ అని అంటారంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోను హాలీవుడ్ హీరోయిన్‌కు కూడా ఆకాశ్ ట్యాగ్ చేయడంతో ఆమె కూడా స్పందించింది. ‘ఇది ఫన్ వీకెండ్’ అంటూ అలెగ్జాండ్ర బదులిచ్చింది. నెటిజన్లు కూడా ఈ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఆకాశ్ చిన్న ట్రిక్ ప్లే చేసి హీరోయిన్ దృష్టిలో పడ్డాడు. అలెగ్జాండ్ర బేవాచ్, శాన్ అండ్రాస్, నైట్ హంటర్, ర్యాంపేజ్, లాస్ట్ ట్రాన్స్‌మిషన్ తదితర సినిమాల్లో నటించింది. 2002 నుంచి బుల్లితెర మీద సందడి చేసిన ఈ భామ.. 2005లో వెండితెరపైకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న కపుల్ చాలెంజ్ విషయంలో లవ్ బర్డ్స్, ఆదర్శ జంటలు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. మనం పెట్టే ఫొటోలు కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఫొటోలకు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవడం మరిచిపోవద్దు.

https://twitter.com/BarnabasAkash/status/1309042130346749959?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1309042130346749959|twgr^share_3&ref_url=https://indianexpress.com/article/trending/trending-globally/mans-couples-challenge-photo-with-alexandra-daddario-impressed-many-even-the-actress-6610117/

Advertisement

Next Story