చెట్టు కొమ్మలతో మంటలు ఆర్పిన మంత్రి

by Shamantha N |
చెట్టు కొమ్మలతో మంటలు ఆర్పిన మంత్రి
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ప్రమాదం జరిగినట్లు సమాచారం అందితే, సాధారణంగా ఏ మంత్రి అయినా ఏం చేస్తాడు? వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు ఆదేశాలిచ్చి ప్రమాద తీవ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్తాడు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తాడు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే మినిస్టర్ కూడా అలానే చేశాడు కానీ అంతటితో తన బాధ్యత ముగిసిందని చేతులు దులుపుకోలేదు. ప్రమాదం సంభవించిన స్థలానికి వెళ్లి, ప్రమాద తీవ్రత తగ్గించేందుకు అక్కడ తను కూడా ఓ వర్కర్‌లా పని చేశాడు.

ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో సోమవారం ప్రమాదవశాత్తుగా అడవి అంటుకుని చెట్లు తగలబడిపోతున్నట్లు మంత్రి హరక్ సింగ్ రావత్‌కు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మినిస్టర్.. సపోర్ట్, అసిస్టెన్స్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను పిలిపించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు. వారు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్న క్రమంలో మంత్రి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే తగలబడిపోతున్న అడవిని చూసి చలించిన మంత్రి.. దగ్గర్లో ఉన్న చెట్ల కొమ్మలను తీసుకొని తాను కూడా మంటలార్పాడు. ఇదంతా రికార్డు చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అటవీ పరిరక్షణకు తన వంతుగా ప్రయత్నించిన మంత్రిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఆర్నెల్ల కాలంలో ఉత్తరాఖండ్‌లో 45 సార్లు అటవీ ప్రమాదాలు జరగ్గా, అవి సంభవించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం తీరత్ సింగ్ రావత్ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు. అడవుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed