- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మతాంతర వివాహం చేసుకోవడం తప్పుకాదు.. అది వారి ప్రాధమిక హక్కు'
చండీగఢ్: తమ జీవిత భాగస్వాములను ఎంచుకోవడం వయోజనుల ప్రాథమిక హక్కు అని ఉత్తరాఖండ్ హైకోర్టు మారోమారు స్పష్టం చేసింది. మతాంతర వివాహం చేసుకున్న దంపతులను వారి కుటుంబీకుల నుంచి భద్రత కల్పించాలని పోలీసులున ఆదేశించింది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను వ్యతిరేకించి అయినా తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే హక్కు మేజర్‌లకు ఉంటుందని, కాబట్టి, కుటుంబసభ్యులు వారిపట్ల సానుకూలంగా నడుచుకోవాలని, బెదిరించడం సరికాదని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల డివిజన్ బెంచ్ తెలిపింది. పరస్పరం ఇష్టపడి ఈ ఏడాదిలోనే ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్నామని దంపతులు కోర్టుకు తెలియజేశారు. కానీ, తమ పెళ్లి ఇష్టం లేని వధువు కుటుంబీకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ దంపతులు తొలుత రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. కానీ, పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టారు.