- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులివ్వాల్సిందే.. ఉత్తమ్ సంచలన ఆరోపణ
దిశ, నేరేడుచర్ల: తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై మాజీ టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఎంపీపీ పార్వతి భర్త మూడావత్ కొండా నాయక్ అదే గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన బుజ్జి శ్రీను ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, దాడి చేయడాన్ని ఉత్తమ్ ఖండించారు. ఈ సందర్భంగా గురువారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఎంపీకి వివరించారు. దీంతో ఉత్తమ్ వెంటనే స్థానిక ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దాడి జరిగి పదిరోజులైనా.. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ భర్తపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తానని అన్నారు. స్థానిక ఎస్ఐ ఇప్పటివరకూ వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని ఖండించి, వెంటనే స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్ కావాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి దాపురించిందని కీలక ఆరోపణ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఆ డబ్బులు తీసుకొని ముఖ్యమంత్రి బంధువైన ఎంపీ సంతోష్ రావుకి రికమెండ్ చేస్తున్నారని, ఆ తర్వాత సంతోష్ రావు ఇంటి నుంచి ఆర్డర్స్ ఇస్తే.. డీజీపీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నానని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందన్నారు. పోలీస్ అధికారులు ఇలా చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంజునాయక్, నవీన్ నాయక్, కరీం, ఎంపీపీ భూక్య గోపాల్, హుజూర్‌నగర్ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు నాగన్న, నిజాముద్దీన్, అరుణ్ దేశ్‌ముఖ్, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
పరస్పరం నినాదాలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శకు వచ్చిన సమయంలో మఠంపల్లి ఎంపీపీ భర్త మూడావత్ కొండానాయక్ అక్కడే ఉండటంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా ‘జై కాంగ్రెస్.. జై టీఆర్ఎస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకున్నప్పటికీ ఎలాంటి ఘర్షణకు తావివ్వకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రశాంతంగా వెళ్లిపోవడంతో పోలీసుశాఖ ఊపిరి పీల్చుకున్నారు.
- Tags
- dgp