- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CSK నెక్ట్స్ కెప్టెన్ అతడే.. ధోని వారసుడిగా జడేజా..!
దిశ, స్పోర్ట్స్: చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు భవిష్యత్‌లో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నాడు. ధోని తన వారసుడిగా జడేజాను చేయాలనే ఉద్దేశంతోనే అతడికి మార్గం సుగమం చేస్తున్నాడని ఊతప్ప వ్యాఖ్యానించాడు. మంగళవారం ముగిసిన ప్లేయర్ రిటెన్షన్స్‌లో చెన్నన్ సూపర్ కింగ్ తొలి ప్రాధాన్యత ఆటగాడిగా రూ. 16 కోట్లతో రవీంద్ర జడేజాను రిటైన్ చేసుకున్నది. ఆ తర్వాత ఆటగాడిగా ఎంఎస్ ధోనిని తీసుకున్నారు. అయితే ఇదంతా ధోని సూచనల మేరకు జరిగినట్లు ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
ధోనికి రవీంద్ర జడేజా సత్తా ఏంటో పూర్తిగా తెలుసని.. ధోని జట్టును వీడిన తర్వాత జడేజానే ఇక కెప్టెన్ అని ఊతప్ప అన్నాడు. ఆ జట్టులో కొంత కాలం ఆడిన పార్థివ్ పటేల్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కెప్టెన్‌కు కావల్సిన అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయి.. చెన్నయ్ జట్టుకు కావలసిన విధంగా జడ్డూ తయారవుతాడు అని పటేల్ వ్యాఖ్యానించాడు. జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా టెస్టు ఫార్మాట్‌లో కూడా రాణిస్తున్నాడు… సీఎస్కే తర్వాత కెప్టెన్‌గా జడ్డూ సరైన చాయిస్ అయిన పటేల్ అభిప్రాయపడ్డాడు.