ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: ట్రంప్

by vinod kumar |
ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: ట్రంప్
X

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వాషింగ్టన్ డీసీ‌లోని లింకన్ మెమోరియల్ హాల్‌ నుంచి ఫాక్స్ న్యూస్‌‌ ప్రసారం చేసిన ‘టౌన్ హాల్’ షో‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి తాము వ్యాక్సిన్‌ను తీసుకొస్తామన్న నమ్మకం ఉందంటూ దీమా వ్యక్తం చేశారు. అలాగే, సెప్టెంబర్‌లో స్కూళ్లు, యూనివర్సిటీలను పున:ప్రారంభిస్తామని వెల్లడించారు. కరోనా నియంత్రణకు నిర్దిష్టమైన కాలంలో వ్యాక్సిన్ రూపొందించడానికి అమెరికా, ఇతర దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. ఒకవేళ అమెరికా కన్నా ముందుగా ఇతర దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొంటే తనకు సంతోషమేననీ, అందుకు వారిని అభినందిస్తానని చెప్పుకొచ్చారు.

Tags: corona/ usa/ trump/ vaccine, end of the year

Advertisement

Next Story