- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ ఆఫర్: టీకా తీసుకుంటే.. ఫ్రీ గంజాయి షాట్
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ‘వ్యాక్సినేషన్’ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. టీకాలు కూడా మంచి ఫలితాన్ని అందిస్తుండగా, ఇప్పటికీ చాలామందిలో వ్యాక్సిన్‌పై అనుమానాలు, సందేహాలున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ తీసుకుంటే రకరకాల బహుమతులు, క్యాష్ ప్రైజ్‌లు అందిస్తున్నాయి. ఈ జాబితాలో అమెరికా కూడా వ్యాక్సినేషన్ రేటును పెంచడానికి, టీకాలు వేయించుకునేందుకు పౌరులను ప్రోత్సహించడానికి యూఎస్ స్టేట్ ఆఫ్ వాషింగ్టన్ ‘జాయింట్స్ ఫర్ జబ్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 21 ఏళ్ల పైగా వయసున్న వ్యక్తులకు గంజాయి మొక్కలను అందిస్తున్నారు.
అనేక దేశాల్లో గంజాయి మత్తు ప్రాణానికి ప్రమాదమని నిషేధించారు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని దేశాలు దీనిని నేరంగా పరిగణించడం లేదు. 14 ఐరోపా దేశాల్లో, అమెరికాలోని 29 రాష్ట్రాలు, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాలో వైద్యపరమైన అవసరాల కోసం గంజాయిని ఉపయోగిస్తున్నారు. 2013లో ఉరుగ్వే మొదటిసారిగా వినోద అవసరాల నిమిత్తం గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన దేశంగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ జాబితాలోకి అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు వాషింగ్టన్ కూడా చేరింది. అయితే ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు వాషింగ్టన్‌లో 54 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. కాగా వ్యాక్సినేషన్ రేట్ పెంచడానికి గత నెలలో ‘సిక్స్ వీక్ విండో’లో తమ టీకా స్వీకరిస్తే అడల్ట్స్‌కు బార్లలో ఒక ఉచిత ఆల్కహాల్ డ్రింక్స్ ఇస్తామని ప్రకటించింది.
ఈ క్రమంలోనే వాషింగ్టన్ ప్రభుత్వం ‘జాయింట్స్ ఫర్ జాబ్స్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. స్టేట్ లిక్కర్ అండ్ గంజాయి బోర్డ్ లైసెన్స్ పొందిన అవుట్‌లెట్‌లలో జూలై 12లోపు వ్యాక్సిన్ తీసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి ప్రీ-రోల్డ్ జాయింట్ అందిస్తారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4 నాటికి కనీసం 70 శాతం అమెరికన్ అడల్ట్స్‌కు టీకాలు వేయాలని యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే తాజా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ప్రస్తుత సంఖ్య 63.7 శాతంగా ఉంది. ఇక కాలిఫోర్నియా, ఒహియోలలో నగదు బహుమతులు, కళాశాల స్కాలర్‌షిప్‌లు అందించే టీకా ‘లాటరీలను’ నిర్వహిస్తున్నాయి.