యువరాణితో టెన్నిస్ ఆడిన ఎమ్మా రాడుకాను..

by Shyam |
sports
X

దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన ఎమ్మా రాడుకాను‌ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి బ్రిటిష్ మహిళ టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడంతో ఇప్పుడు అక్కడ ఆమె స్టార్ సెలెబ్రిటీ అయ్యింది. యూఎస్ ఓపెన్ తర్వాత గెట్ గాలా, లండన్ ఫ్యాషన్‌ వీక్‌లలో పాల్గొన్న ఎమ్మా.. తాజాగా యువరాణి కేట్ కేథరిన్‌తో టెన్నిస్ ఆడే అవకాశాన్ని పొందింది. ఎమ్మా రాడుకాను కోసం బ్రిటిష్ రాజ కుటుంబం నేషనల్ టెన్నిస్ సెంటర్‌లో పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. అక్కడ ఎమ్మాను ఘనంగా సన్మానించిన తర్వాత రాకుమారి కేథరిన్‌తో 30 నిమిషాల పాటు టెన్నిస్ ఆడింది.

మ్యాచ్ అనంతరం ఎమ్మా మాట్లాడుతూ రాకుమారి కేథరిన్ మంచి ఫోర్‌హ్యాండ్ షాట్లు కొడుతున్నట్లు చెప్పింది. తనకు ఈ గౌరవం అందించిన రాజకుటుంబానికి ధన్యవాదాలని చెప్పింది. అనంతరం లాన్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులతో కూడా ఎమ్మా కాసేపు టెన్నిస్ ఆడింది. అయితే యూఎస్ ఓపెన్ గెలుపులో ఎమ్మాకు తోడుగా ఉన్న కోచ్ ఆండ్రూ రిచర్డ్‌సన్‌తో విడిపోయింది. కాగా, యూఎస్ ఓపెన్ వరకే ఒప్పందం ఉండటంతో అతడు వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed