- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US ఏయిర్ ఫోర్స్ మరో సంచలనం.. నిఘా కోసం మైక్రో డ్రోన్స్ రూపకల్పన
దిశ, ఫీచర్స్ : శత్రు రాజ్యాలు లేదా పొరుగు రాజ్యాల సీక్రెట్స్ తెలుసుకోవడానికి, అక్కడి విశేషాలను చేరవేయడానికి ‘వేగు’(సీక్రెట్ ఏజెంట్స్)లను పెట్టేవాళ్లు రాజులు. వారి కాలంలో పావురం, గద్ద లేదా ఇతర పక్షుల సాయంతో సందేశాలను పంపించేవాళ్లు. ఈ క్రమంలోనే చిన్న పక్షులు, కీటకాల నుండి ప్రేరణ పొందిన యుఎస్ వైమానిక దళం మైక్రోడ్రోన్లను రూపొందించనున్నట్లు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించగా.. వీటిని ఓపెన్ సర్వేలైన్స్‌లో నిఘా పెట్టడానికి ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
సైన్స్ ఫిక్షన్ లేదా సూపర్ హీరో సినిమాల్లో చిన్నచిన్న రిమోట్ పరికరాలను, స్పై కెమెరాలను చూస్తుంటాం. అలానే యూఎస్ ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్‌లోని పరిశోధకుల బృందం, ఏరియన్ హెల్త్ ఎల్‌ఎల్‌సి సహకారంతో ఎగిరే పక్షులు, కీటకాల బయోమెకానికల్ కదలిక ఆధారంగా మైక్రో-ఏరియల్ వెహికల్‌ను అభివృద్ధి చేసింది. రిమోట్ కంట్రోలర్ సహాయంతో ఈ డ్రోన్ నియంత్రిస్తారు. కీటకాల వలె వేగంగా వెళ్లే సామర్థ్యం, వేగాన్ని మార్చుకోగల శక్తి దీని సొంతం. దీని ద్వారా సొరంగాలు, యంత్రాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో నిఘా నిమిత్తం ఉపయోగించుకోనున్నారు. యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. రెక్కలు ఆడించే వేగం ఆధారంగా డ్రోన్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక రిజిడ్ బాడీ, మూడు డైమెన్షన్స్(ఎక్స్, వై, జడ్)లో స్వేచ్ఛగా తిరిగే ‘6 డిగ్రీ ఫ్రీడం’ను ఈ డ్రోన్ కలిగి ఉండటం విశేషం.
జనవరిలో ఏరియన్ హెల్త్‌తో వైమానిక దళం ప్రత్యేక పేటెంట్ లైసెన్స్ ఒప్పందం చేసుకోగా.. దీని ప్రకారం 15 నెలల్లో సంస్థ ‘ప్రొటోటైప్’ను అభివృద్ధి చేయాలి. ఈ క్రమంలోనే అనుకున్న సమయంలోనే ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీ్ట్ చేశారు. త్వరలోనే ఇవి ఎయిర్‌ఫోర్స్‌లో భాగంగా పనిచేయనున్నాయి.