- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మానవాళి మేల్కొనే సమయం ఆసన్నమైంది : ఊర్మిళ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ .. మనుషుల జీవనశైలిని మార్చేసింది. దేశంలో 21 రోజులు ప్రజలను ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. కానీ ఈ సమయాన్ని చాలా మంది చక్కగా ఆస్వాదిస్తున్నారు. కుటుంబీకులతో, మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. అయితే కరోనా అనేది తనపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం చూపలేదంటున్నారు సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోండ్కర్. ఎప్పుడూ ఇంట్లోనే ఏకాంతంగా ఉండాలని కోరుకునే ఊర్మిళ… 24 గంటలు షూటింగ్ చేసినా.. ప్యాకప్ చెప్పిన వెంటనే ఇంటికి పరుగులు పెట్టేవారట. దీంతో కరోనా ఎఫెక్ట్ తనను ఇంటికి పరిమితమయ్యేలా చేయడంతో పెద్దగా ఇబ్బంది పడలేదని చెబుతోంది.
ప్రస్తుతం పెంపుడు కుక్కలతో బిజీగా ఉన్న ఊర్మిళ… తన భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ కంపెనీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారట. కానీ ఈ లాక్ డౌన్ .. ఖచ్చితంగా మన జీవనం, జీవనశైలి అనే అంశాలపై ఆత్మపరిశీలన చేసుకునేందుకు మంచి సమయమని అభిప్రాయపడింది ఊర్మిళ. జీవితం ఎంత చంచలమైందో గ్రహించాల్సిన క్షణం ఇదేనన్నారు. మానవాళి ప్రకృతి పట్ల కృతజ్ఞతగా, వినయంగా ఉండాలన్న మేల్కొలుపు వచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Tags : Corona, Corona virus, Covid-19, Mohsin Akhtar, Urmila Matondkar