ఉన్న పరిస్థితులేంటి…తీసుకున్న చర్యలేంటి? : ఐఎమ్ఎఫ్!

by Harish |
ఉన్న పరిస్థితులేంటి…తీసుకున్న చర్యలేంటి? : ఐఎమ్ఎఫ్!
X

ఇండియా ఋణభారం పెరిగిపోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) హెచ్చరించింది. పెరుగుతున్న ఋణభారం కారణంగా భారత ప్రభుత్వం అత్యవసరంగా ప్రతిష్ఠాత్మక ఆర్థిక సంస్కరణ చర్యలు చేపట్టాలని ఐఎమ్ఎఫ్ స్పష్టం చేసింది. ఆర్థిక వ్యుహాలు అవసరమని తెలిపింది. తాజా బడ్జెట్‌పై స్పందించిన ఐఎమ్ఎఫ్…ఇండియా అత్యంత వేగంగా సమీకృత ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టాల్సిన అవసరముందని గుర్తుచేసింది. ఈ సంస్కరణలు నిర్మాణాత్మకంగా ఉండాలని పేర్కొంది. ఇండియాలో ఆర్థికపరమైన పరిస్థితులు అంచనాలను మించి బలహీనంగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. వివిధ రంగాలు పునరుత్తేజం పొందడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆధారపడే బడ్జెట్‌లో దృష్టి పెట్టారు. అదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని కట్టడి చేసే విధంగా ఆర్థికపరమైన వ్యూహాల్ని అమలు చేయాల్సిన అవసరముందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. అలా చేయకుండా బడ్జెట్‌లో మరింత సర్దుబాటు చేసే వైఖరిని అనుసరించి ఉంటే బాగుండేదని ఐఎమ్ఎఫ్ అధికార ప్రతినిధి జెర్రీ రైస్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed