ప్రభుత్వానికి ఈ విషయం తెలిస్తే షాకవుతది!

by Shyam |   ( Updated:2020-08-07 21:40:01.0  )
ప్రభుత్వానికి ఈ విషయం తెలిస్తే షాకవుతది!
X

దిశ ప్రతినిధి, మెదక్: కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు మొదలుపెట్టారు. కానీ, యూరియా కొనేందుకు రైతులు ఆలోచిస్తున్నారు. దుకాణదారులు చెప్పే ధరలు విని ఆశ్చర్యపోతున్నారు. అందేంటని దుకాణదారులను ప్రశ్నిస్తే స్టాక్ లేదని సమాధానమిస్తున్నారు. ఇచ్చిన ధరకు కొంటే కొనండి లేదంటే కొనకండి అంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదును చూసి ధరలు పెంచితే తాము ఏమైపోవాలని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో జిల్లాకు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అంత మొత్తంలో జిల్లాలకు చేరడం లేదని, ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపడుతున్నారని సమాచారం.

ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా నిల్వలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పది రోజులుగా వర్షాలు కురుస్తుం‌డడంతో యూరియా వేసేందుకు రైతులు దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వారు చెప్పే ధరలు విని ఆశ్చర్యబోతున్నారు. కంపెనీల నుంచి సరఫరా, రవాణా సమస్య వల్ల యూరియా రావడం లేదు. అడపాదడపా వస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇదే అదనుగా చేసుకొని వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో యూరియా కొనుగొనేందుకు రైతులు ఆలోచిస్తున్నారు. కొందరైతే యూరియా వేయకుండానే వరినాట్లు వేస్తున్నారు. మరి కొందరు ఇతర ఎరువులు వైపు చూస్తున్నారు. వానాకాలం సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అది ఆచరణలో కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలే అధికం. ఈసారి పత్తి పంట 2లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. వరి సాగు ఈ సారి తగ్గినప్పటికీ.. పంట విస్తీర్ణం మాత్రం పెరిగింది. ఇప్పుడిప్పుడే రైతులు వరినాట్టు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం నాట్లు వేయడానికి యూరియా తప్పనిసరి కావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.

కేంద్రం నుంచి సబ్సిడీ ఇలా..

కేంద్ర ప్రభుత్వం యూరియా అమ్మకం మీదనే సబ్సిడీ విధానం (డీబీటీ ) ప్రవేశపెట్టింది. ప్రతి ఎరువుల దుకాణానికి పీలోఎస్ మిషన్ ద్వారా అమ్మకం చేస్తోంది. విక్రయించిన యూరియాకు కేంద్ర ప్రభుత్వమే రాయితీ ఇస్తుంది. 50 కిలోల యూరియా బస్తాకు రైతు రూ.285 చెలిస్తే, కేంద్రం రూ.935 రాయితీ ఇస్తుంది. 45 కిలోల యూరియా బస్తాకు రూ.266 రైతు ధర కాగా, కేంద్రం రూ.850 రాయితీ చెల్లిస్తోంది. ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు సకాలంలో రాయితీలను విడుదల చేయని కారణంగానే యూరియా కొరత ఉత్పన్నమవుతోందని తెలుస్తోంది.

రూ.266 బస్తా ధర రూ.320కి..

‘ఎరువుల కొరత ఉండదు, రైతులు ఇబ్బందులు పడాల్సిన పని లేదు’ అంటూ సదస్సుల్లో అధికారులు చెబుతున్నారు. దీంతో సీజన్ ప్రారం భంలో రైతులు యూరియాను పెద్దగా కొను గోలు చేయలేదు. ప్రస్తుతం కురుస్తున్న వాన లకు పంటకు ఎరువులు వేయడానికి రైతులు సిద్ధపడి దుకాణాలకు వెళ్తున్నారు. యూరియా నిల్వలు లేవని, కంపెనీల నుంచి దిగుమతి తగ్గడంతో కొరత ఏర్పడిందని దుకాణదారులు చెబుతున్నారు. అందులోనూ కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో రైతులు యూరియానే ఎక్కువ వాడుతారు. ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాలను వినియోగిస్తున్నారు. యూరి యా కొరతకు ఇది కూడా మరో కారణంగా చెప్పొచ్చు. ప్రభుత్వ ధర ప్రకారం యూరియా బస్తాను రూ.266 కు విక్రయించాలి. కానీ, దు కాణాల్లో వీటి ధర రూ.320 వరకు పలుకుతోంది.

ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే.. యూరియా స్టాక్ లేదని, ఇష్టముంటే కొనండి.. లేదం టే మానెయ్యండి అంటూ దుకాణదారులు తెగే సి చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. డీసీఎంఎస్, పీఏసీఎస్ ద్వారా ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నా, ప్రైవేట్ డీలర్లు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేం ద్రాలతో పాటు పలు మున్సిపాలిటీ కేంద్రాల్లో దుకాణదారులు ధర లు పెంచి విక్రయిస్తున్నారు. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కోస్పిక తదితర కంపెనీలు యూ రియాను సరఫరా చేస్తున్నా యి. ప్రస్తుతం ఒ క్కో జిల్లాకు 10 వేల టన్నుల కు పైగా యూరి యా అవసరం. సరఫరా సరి గ్గా లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీన్ని అ దునుగా భావించి కొందరు వ్యాపారులు కృత్తి మ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ధరలు పెంచి అమ్ముతున్నారు: మహేందర్ రెడ్డి, రైతు

ప్రభుత్వం కేటాయించిన ధరకు కా కుండా బస్తా యూరియా రూ.320 వరకు దుకాణదారులు అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్టాక్ లేదు. మీ ఇష్టం అంటూ కసురుకుంటున్నారు. వానలు పడడంతో దుక్కులు దున్ని నాట్లు వేసి నం. ఇప్పుడు యూరియా వేయాలి. దుకాణాల్లో కొరత ఉందని చెబుతూ రేట్లు పెంచితే కొనేదెలా.? ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలి. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed