- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్బన్ పార్క్ పనులు ప్రారంభం
దిశ, నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమీపంలో జూకల్ శివారులో అర్బన్ పార్క్ పనులు గురువారం ప్రారంభం అయ్యాయి. జూక్కల్ గ్రామ శివారులో ఉన్న 500 ఎకరాల ఫారెస్ట్ భూముల్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు.
పార్కులో వాచ్ టవర్, యోగా షెడ్, 15 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, చిన్నారులు యువకులు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఏర్పాటు చేయనున్నట్టు ఫారెస్ట్ అధికారులు వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సువిశాలమైన పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఎనిమిది కిలోమీటర్ల మేర జాలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెండు కిలోమీటర్ల వరకు కంపౌండ్ వాల్‌ను నిర్మాణం చేయనున్నారు.
ప్రస్తుతం అటవీ ప్రాంతంలో వీడ్ రిమూవల్ పనులను 50 మంది కూలీలతో చేస్తున్నారు. మహావీర, రాం పరికి (లాంటనా) , వంటి పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. మొత్తం ఐదు వందల ఎకరాల్లో ఈ పిచ్చి మొక్కలు తొలగించి అర్బన్ పార్క్‌గా రూపొందించేందుకు పనులు చేపడుతున్నామని ఎఫ్‌ఆర్ఓ దేవీలాల్, ఎఫ్ఎస్‌ఓ మల్లేశం, ఎస్‌బీఓ ప్రసాద్‌లు తెలిపారు. కరోనా సమయంలో పనులు లేని మాకు ఈ పనులతో ఉపాధి దొరుకుతుందని జూక్కల్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.