- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో జిల్లాకు పేరు మార్చనున్న యూపీ సర్కార్
by Ramesh Goud |
X
ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్.. మరో జిల్లా పేరును మార్చడానికి సిద్ధమవుతున్నది. 2018లో ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్పు చేసిన యూపీ ప్రభుత్వం.. తాజాగా, బస్తీ జిల్లాను వశిష్ట నగర్‌గా మార్చాలని యోచిస్తున్నది. జిల్లా పాలన యంత్రాంగం ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను మొదలుపెట్టిందనిసంబంధిత అధికారులు వెల్లడించారు. తాము బస్తీ జిల్లా పేరును వశిష్ట నగర్‌గా మార్చాలనుకుంటున్నామనీ, దీనికి సంబంధించిన ప్రతిపాదనను గతంలోనే రాష్ట్రప్రభుత్వానికి పంపించామని అధికార బీజేపీ ఎంపీ హర్ష ద్వివేది తెలిపారు. కాగా, రాముడు అయోధ్య నుంచి జనకపురి వెళ్లేటప్పుడు ఈ ప్రాంతలో ఒకరోజు బసచేసినట్టు అక్కడి స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా రాముడి గురువు మహర్షి వశిష్ట కూడా ఇక్కడే గడిపారని విశ్వసిస్తారు.
Advertisement
Next Story