- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీ మీటింగ్… నిందితులకు న్యాయం జరగాలి’
లక్నో: హాథ్రస్ బాధితులకు న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండగా కొందరు అగ్రకులస్తులు నిందితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. హాథ్రస్ జిల్లాలోని ఓ బీజేపీ నేత నివాసంలో వీరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యక్తిగతంగానే పాల్గొన్నట్టు బీజేపీ నేత రాజ్‌వీర్ సింగ్ పెహల్వాన్ తెలిపారు. హాథ్రస్ కేసులోని ఓ నిందితుడి కుటుంబమూ ఈ సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశం గురించి పోలీసులకు సమాచారమిచ్చారని, బాధిత కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సమావేశాన్ని నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు.
నిందితులను తప్పుగా టార్గెట్ చేసి ఇరికించారని ఆరోపించారు. బాధిత కుటుంబంపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, రాజకీయ నేతలు ఐదుగురి చొప్పున వారిని కలుసుకోవచ్చునని జిల్లా జాయింట్ మెజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాశ్ మీనా తెలిపారు. వాస్తవానికి హాథ్రస్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం కారణంగా పోలీసులు సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. కానీ, సాంకేతికంగా వీరు ఒకరి ఇంట్లో ప్రైవేటుగా సమావేశమైనందున అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తున్నది. శుక్రవారమూ కొందరు అగ్రకులస్తులు బాధితుల గ్రామ సమీపంలో గుమిగూడటం గమనార్హం.