దళితుడిపై అగ్రవర్ణాల దాడి..

by Sumithra |
దళితుడిపై అగ్రవర్ణాల దాడి..
X

తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజిలో దారుణం చోటుచేసుకుంది. పంటపొలాల్లో మల విసర్జన చేశాడని ఓ దళితునిపైన అగ్రవర్ణాల వారు దాడులు చేశారు.ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గొడవను సర్దుమనిచారు. అనంతరం యువకుడిని అలాగే గాయాలతో ఇంటికి పంపించివేశారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దెబ్బలు తట్టుకోలేక ఆ దళిత యువకుడు మృతి చెందాడు.దీంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల పెద్దఎత్తున్న నిరసనలు తెలపుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story