- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఉప్పెన’ వండర్‌ఫుల్ ఫిల్మ్ : సుకుమార్
దిశ, సినిమా : మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ.. ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజై భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొంది. యునానిమస్ హిట్ టాక్‌తో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో మూవీ మేకర్స్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్.. చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్ చెప్పారు. ‘ఇది నాకు మెమొరబుల్ మూమెంట్, ఉప్పెన లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి, బుచ్చి తనను నిజమైన గురువుని చేశాడని ఫీలవుతున్నా’ అని సుక్కు పేర్కొన్నారు. బుచ్చి ఒక కొత్త డైరెక్టర్‌లా కాకుండా ‘ఉప్పెన’ చిత్రాన్ని ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా వండర్‌ఫుల్‌గా తీశాడని కొనియాడారు. కాగా సుకుమార్ గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.