ఓవర్‌నైట్ స్టార్‌గా ‘ఉప్పెన’ హీరోయిన్..

by Shyam |
ఓవర్‌నైట్ స్టార్‌గా ‘ఉప్పెన’ హీరోయిన్..
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఉప్పెన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో లంగా ఓణిలో సంప్రదాయబద్ధంగా కనిపించిన భామ.. తెలుగులో చక్కగా మాట్లాడి బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది. ఈ ఫంక్షన్‌లో పెద్దలు ఆశీర్వదించినట్లుగానే త్వరలోనే స్టార్ రేంజ్‌కు దూసుకుపోయేలా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ చూసిన తర్వాత ఇప్పటికే తనను చాలా మంది డైరెక్టర్లు సంప్రదించగా.. తాజాగా హీరో సూర్య కూడా తన సినిమాలో ఫిమేల్ లీడ్‌గా కృతిని ఎంపిక చేశారని సమాచారం. డైరెక్టర్ హరి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తనను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

ఇక నాగశౌర్య హీరోగా వస్తున్న చిత్రంలో ఇప్పటికే తన పేరు వినిపిస్తుండగా.. అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలోనూ తనను సెలెక్ట్ చేసేశారని ఫిల్మ్ నగర్ టాక్. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. కృతి చాలా బిజీ అయిపోనుంది.. ఎవరైనా ఉంటే ఇప్పుడే బుక్ చేసుకుంటే మంచిదని ఫిల్మ్ మేకర్స్‌కు ఆల్రెడీ సజెస్ట్ చేశారు చిరు.

పంజా వైష్ణవ్ తేజ్, కృతి జంటగా నటించిన ‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతుండగా.. బుచ్చి బాబు సన దర్శకులు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతోంది.

Advertisement

Next Story

Most Viewed