- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం
X
దిశ, ఉప్పల్ : ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రయివేట్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లిఫ్టులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థుకు వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది.. లిఫ్ట్ తలుపులను తెరిచి అందరినీ బయటకు తీశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు అందరు సురక్షితంగా బయట పడ్డారు. కాగా, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముళ్ల పరమేశ్వర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Advertisement
Next Story