- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుద్దాదిత్య మెహంతిపై చర్యలు తీసుకోవాలి
దిశ, నర్సంపేట: రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేసిన బుద్ధాదిత్య మెహంతి అనే వ్యక్తిపై వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్ ఎస్ యూ ఐ వరంగల్ జిల్లా అధ్యక్షులు జయ్యారపు అఖిల్ మాట్లాడుతూ... జర్మనీకి గెష్టపో, ఇజ్రాయెల్ కి మొసాద్, అమెరికాకి సీఐఏ ఉందని, భారత్ కి లారెన్స్ భిష్ణోయ్ ఉన్నాడంటూ నెక్స్ట్ జాబితాలో రాహుల్ గాంధీ, ఒవైసీ ఉన్నాడని పోస్ట్ లో పేర్కొన్నట్లు తెలిపారు. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఒక గ్యాంగ్ స్టార్ ని కీర్తిస్తున్నట్లు పోస్ట్ ఉందని ఆరోపించారు.
ఈ క్రమంలో ఇటువంటి బెదిరింపులు ప్రజల భద్రతకు, రాహుల్ గాంధీ భద్రతకు హాని కలిగించేలా ఉన్నాయన్నారు. గతంలో రాజకీయ పార్టీల నాయకులకు ఆన్లైన్ వేదికగా వచ్చిన బెదిరింపులు హింసకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ వేదికగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన బుద్ధాదిత్య మెహంతి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ నియోజకవర్గ అధ్యక్షులు బేతి భరత్, పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్, నాయకులు వనపర్తి శోభన్ కుమార్, విజేందర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.