- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జికా వైరస్ కలకలం.. 89 పాజిటివ్ కేసులు.. వైద్యులు అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం జికా వైరస్ బాధితుల సంఖ్య 89కి చేరింది. ఈ నేపథ్యంలో జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు వాయుసేన సిబ్బందికి జికా సోకిన కారణంగా ఐఏఎఫ్ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్ జిల్లా యంత్రాంగం కృషిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని సూచించారు.
- Tags
- cases