- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేట్‌గా ఆర్డర్ చేస్తే.. ఫ్రీ ఫుడ్ వచ్చేసింది!
దిశ, ఫీచర్స్ : ఒక ఆస్ట్రేలియా వ్యక్తి రెస్టారెంట్ క్లోజ్ చేయడానికి కొద్ది నిమిషాల ముందు ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే ఆ టైమ్‌లో ఆర్డర్ చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఓ నోట్ కూడా షేర్ చేశాడు. ‘ఫెటుక్సిన్ కార్బోనారా పాస్తా’ అనే ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేసిన కస్టమర్.. ‘ఆలస్యంగా ఆర్డర్ చేస్తున్నందుకు క్షమించండి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న నేను ఇప్పుడే నిద్ర లేచాను. మీరు రెస్టారెంట్ మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లైతే ఆర్డర్ క్యాన్సల్ చేయండి. అర్థం చేసుకుంటాను’ అని నోట్‌లో పేర్కొన్నాడు.
కాగా ఈ నోట్‌తో ఇంప్రెస్ అయిన రెస్టారెంట్ స్టాఫ్ .. తను ఆర్డర్ చేసిన ఐటెమ్‌తో పాటు ఫ్రీ ఫుడ్ కూడా పంపించారు. ‘దయతో కూడిన మీ మెసేజ్‌కు థాంక్స్. ఆలస్యంగా ఆర్డర్ చేయడం గురించి ఒత్తిడికి లోను కావద్దు. మాకేం అభ్యంతరం లేదు. మీరు బెటర్‌గా ఫీల్ అయ్యేందుకు గార్లిక్ బ్రెడ్ ఫ్రీగా పంపిస్తున్నాం. మీలాంటి మంచి సందేశాలు నిజంగా మా రోజును మెరుగుపరుస్తాయి. ధన్యవాదాలు’ అనే నోట్‌ను ఈ ఆర్డర్‌కు యాడ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి రెస్టారెంట్ స్టాఫ్ మెంబర్ రెడిఫ్‌లో షేర్ చేయగా.. దీనిపై స్పందించిన కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపాడు. తనను ఇంతగా అర్థం చేసుకున్న ఆ రెస్టారెంట్ స్టాఫ్ అందరికీ నుదుటిపై ముద్దు పెట్టాలని ఉందని ప్రేమను వ్యక్తం చేస్తూ ‘థాంక్యూ కింగ్స్’ అని తెలిపాడు.