- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు.. పట్టించుకునేవారేలేరా..?
దిశ, సిద్దిపేట: రాజుల సోమ్ము రాళ్ల పాలు అన్న చందంగా పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతుందని చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక భవనాలను నిర్మించినా.. వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి నిరుపయోగంగా మరాయని గణేష్ అన్నారు. చిన్నకోడూర్ మండలంలో నిరుపయోగంగా ఉన్న స్త్రీశక్తి భవనాన్ని జాతీయ ఉపాధి హమీ నిధుల ద్వారా చిన్నకోడూర్ లో రూ.25 లక్షలతో నిర్మించారు. 2013 సెప్టెంబర్ 2న ఈ భవనాన్ని ప్రారంభించారు. అన్ని హంగులతో భవనం నిర్మించడంతో మండల మహిళ సంఘాల ప్రతినిధులు సమావేశాలకు అనువుగా ఉంటుందని సంతోషపడ్డారు. కానీ మహిళలకు అందుబాటులో లేకపోవడంతో భవనం నిరుపయోగంగా మారింది. దీంతో లక్షల విలువైన భవనం ఇలా నిరుపయోగంగా మారి ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు.
లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను ఉపయోగించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. అలాగే చిన్నకోడూర్ మండల కేంద్రంలో ప్రయాణీకుల సౌకర్యార్దం 8 లక్షలతో బస్ స్టాండ్ నిర్మించారు. బస్ స్టాండ్ అందుబాటులోకి రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్ స్టాండ్ పంచాయితీల నిర్వహణకు అడ్డాగా మారిందని, బస్ స్టాండ్ ఎదుట నిర్మించిన ప్లాట్ ఫామ్ ధాన్యాల అరబోతకు రైతులకు సౌకర్యంగా మారిందని అన్నారు. ఇలా మండల పరిధిలోని ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా నిరుపయోగంగా ఉన్న భవనాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపి నిరుపయోగంగా ఉన్న భవనలను వినియోగంలోకి తేచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.