- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్.. ‘#అన్‌మ్యూట్ ది వరల్డ్’ క్యాంపెయిన్
దిశ, ఫీచర్స్ : ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిందంటే దానికి కారణం ‘ఇంటర్నెట్’. ఇక కరోనా మూలంగా అందరూ ఐసోలేట్ అయినా ‘వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్‌లైన్ లెస్సన్స్’ కొనసాగుతున్నాయంటే అందుకు కారణం అంతర్జాలమే. అంతేకాదు హోమ్ నీడ్స్ డోర్ డెలివరీ కావాలన్నా.. మారుమూల గ్రామానికి, పట్టణానికి మధ్య ‘కమ్యూనికేషన్ సాధ్యమవుతుందన్నా.. అంతా ఇంటర్నెట్ పుణ్యమే. అయితే ఇప్పటికీ ఎన్నో గ్రామాలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ హెల్త్ సర్వీసెస్ (జీహెచ్ఎస్), వర్ట్.కామ్(virt.com) కలిసి తాజాగా ‘# అన్‌మ్యూట్ ది వరల్డ్’ అనే కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రాథమిక మానవ హక్కుగా మార్చడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం.
91 సంవత్సరాల క్రితం న్యూయార్క్ నగరంలోని AT & T సంస్థల మధ్య తొలి వీడియో కాల్ నడిచింది. దాదాపు ఒక శతాబ్దం తర్వాత, వర్చువల్ సమావేశాలు చాలా మందికి రోజువారీ ప్రమాణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే తొలినాళ్ల వీడియో కాల్‌కు గుర్తుగా, ఇటీవలే ‘వర్చువల్ మీటింగ్ డే’ (ఏప్రిల్ 9) వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘# అన్‌మ్యూట్ ది వరల్డ్’ క్యాంపెయిన్‌ను జీహెచ్ఎస్, వర్ట్.కామ్ కలిసి ప్రారంభించాయి. సంపన్న దేశాల్లో 87% మంది ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 47% మంది కనెక్ట్ అయ్యారు. తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 19% మంది మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారు.
‘పెరుగుతున్న ఈ వర్చువల్ ప్రపంచంలో.. ఇంటర్నెట్ సదుపాయం విలాసవంతమైనదే కానీ మానవ హక్కు కాదు. #UnmuteTheWorld లక్ష్యం డిజిటల్ విభజనపై అవగాహన కల్పించడంతో పాటు ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విభజనను తగ్గించే చర్యలను వేగవంతం చేసేందుకు ఇది సమిష్టి ప్రయత్నం. ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి అవసరమైన విధానాల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాలు, మల్టీలాటెరల్ ఏజెన్సీల నుంచి ఈ ప్రచారం అనేక రకాల చర్యలను కోరుతుంది. ఈ ప్రచారంలో దాతలు, ఫండర్స్, టెక్ కంపెనీలు, ఈవెంట్ నిర్వాహకులతో పాటు డిజిటల్ విభజన గురించి అవగాహన పెంచుకోగల ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాను’
– డేవిడ్ గోల్డ్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, వర్ట్.కామ్ సీఈవో