NTR : మా నాన్న లేని లోటు.. ఆ హీరోయిన్ తీర్చింది!

by Veldandi saikiran |
NTR : మా నాన్న లేని లోటు.. ఆ హీరోయిన్ తీర్చింది!
X

దిశ, వెబ్ డెస్క్: మా నాన్న లేని లోటు.. విజయశాంతి ( Vijayashanthi ) రూపంలో తీరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR). ఈ రోజు.. నాన్న లేని లోటు విజయశాంతి భర్తీ చేశారని... వెల్లడించారు. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ( arjun son of vyjayanthi movie) సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) హీరోగా చేసిన ఈ సినిమా సక్సెస్ కావాలంటూ.. కోరారు జూనియర్ ఎన్టీఆర్.

అలాగే విజయశాంతిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. విజయశాంతి చేసిన పాత్రలు ఇప్పటివరకు మరెవరు కూడా చేయలేదని గుర్తు చేశారు. ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తారు అంటూ పేర్కొన్నారు. అలాగే విభిన్న పాత్రలు చేయడంలో కళ్యాణ్ రామ్ ముందుంటాడని వెల్లడించారు. అలాంటి పాత్రలు కళ్యాణ్ రామ్ కు మాత్రమే షూట్ అవుతాయని... చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

అలాగే... అతి త్వరలోనే ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని కూడా జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR) ఈ సందర్భంగా ప్రకటన చేశారు. తాను నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ 2025న రిలీజ్ కాబోతున్నట్లు కూడా తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR) ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతున్నంత సేపు... అక్కడ కూర్చున్న అభిమానులందరూ కేకలు, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు.


Next Story

Most Viewed