అన్‎లాక్ 2 గైడ్ లైన్స్‌ ఇవే

by  |
అన్‎లాక్ 2 గైడ్ లైన్స్‌ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపుల భాగంగా.. అన్‎లాక్ 2 గైడ్ లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని కంటైన్ మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అంతర్జాతీయ, దేశీయ విమాన, రైల్వే ప్రయాణాలపై పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది.

మరోవైపు విద్యా సంస్థలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, థియేటర్లు, జిమ్‌లు, స్వమ్మింగ్ పూల్స్, సామాజిక, రాజకీయ బహిరంగ సమావేశాలతో నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలు, మెడికల్, వస్తు రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్ మెంట్ జోన్‌లల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ జోన్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది.


Next Story

Most Viewed